News August 8, 2025

ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

image

AP: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘నిషేధంపై ఆలయాల్లో బోర్డులు పెట్టాలి. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే కవర్ల స్థానంలో కాటన్/జూట్/పేపర్ బ్యాగులు వాడేలా చూడాలి. అరిటాకులు/స్టీల్ ప్లేట్లలో అన్నప్రసాదం వడ్డించాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనుమతించొద్దు. స్టీల్ మగ్గులు, గ్లాసులు అందుబాటులో ఉంచాలి’ అని అధికారులను ఆదేశించింది.

Similar News

News August 8, 2025

APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 26వరకు అప్లై చేసేందుకు అవకాశం కల్పించింది. అనుభవం తప్పనిసరి. కనిష్ఠ వయోపరిమితి 24 ఏళ్లు, గరిష్ఠంగా 42 ఏళ్లుగా పేర్కొంది. జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు రూ.850, మహిళా అభ్యర్థులు, ఇతరులకు రూ.175 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 8, 2025

చైనాపై టారిఫ్స్ పెంచాలంటే ట్రంప్ వణుకు.. కారణమిదేనా?

image

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా చైనాపై సుంకాలు పెంచేందుకు ట్రంప్ భయపడుతున్నారు. ప్రస్తుతం చైనా వస్తువులపై 30% టారిఫ్స్ విధిస్తున్నారు. USలోని ప్రముఖ ఆటోమొబైల్, టెక్ కంపెనీలకు చైనా అరుదైన ముడి సరుకులు సప్లై చేస్తోంది. టారిఫ్స్ పెంచితే ధరలు పెరుగుతాయి. అమెరికాను శాసించే బడా కంపెనీలు దీనికి సిద్ధంగా లేవు. ఒకవేళ ట్రంప్ ఆ పని చేస్తే వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.

News August 8, 2025

వరుస అల్పపీడనాలు.. ముప్పు పొంచి ఉందా?

image

AP: ఈ నెలలో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడి, పశ్చిమ దిశగా కదులుతుందని అంచనా వేశారు. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత వెంటవెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, అవి తుపాన్లుగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.