News December 28, 2024

విశాఖలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

image

AP: విశాఖ వాసులకు అలర్ట్. GVMC పరిధిలో జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని మేయర్, కమిషనర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటిని వాడే వారిపై జరిమానా విధించడంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రజలకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.

Similar News

News December 29, 2024

H-1B వీసాలపై మౌనం వీడిన‌ ట్రంప్

image

రిప‌బ్లిక‌న్స్-ఎలాన్ మ‌స్క్ మ‌ధ్య H-1B వీసాల వివాదంపై ట్రంప్ మౌనం వీడారు. H-1B వీసాల జారీ గొప్ప కార్య‌క్ర‌మం అంటూ కొనియాడారు. గత త‌న హ‌యాంలో ప‌రిమితులు విధించినా తాజాగా స‌మ‌ర్థించారు. H-1B వీసాల కోసం యుద్ధం చేయడానికి సిద్ధమని మ‌స్క్ ప్ర‌క‌టించ‌డ‌ంపై రిప‌బ్లిక‌న్లు గుర్రుగా ఉన్నారు. MAGAలో భాగంగా స్థానికుల‌కు పెద్ద‌పీట వేయాల‌న్న రిప‌బ్లిక‌న్ల డిమాండ్‌పై ట్రంప్ స్పంద‌న కొత్త చ‌ర్చ‌కు దారితీసింది.

News December 29, 2024

‘ఆడబిడ్డలకే జన్మనిస్తావా?’.. భార్యకు నిప్పంటించిన భర్త

image

ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తుంటే కొందరు తండ్రుల బుద్ధి మాత్రం మారట్లేదు. మగపిల్లలే కావాలంటూ భార్యను కడతేర్చుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని ప‌ర్భానీలో ఉత్త‌మ్ కాలే అనే వ్యక్తి ముగ్గురు ఆడపిల్లలకు జ‌న్మనిచ్చింద‌ని భార్య‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. స్థానికులు ర‌క్షించే ప్ర‌య‌త్నం చేసినా ఫలించలేదు. ఆమె సోద‌రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

News December 29, 2024

ఓటర్లు ల‌క్ష మంది.. ఓటేసింది 2 వేల మందే

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌రుగా న‌మోదు చేసుకోవ‌డంలో చూపిన ఆస‌క్తిని, ఓటు వేయ‌డంలో చూప‌లేదు విదేశాల్లో ఉన్న భార‌తీయులు. గ‌త ఎన్నిక‌ల కోసం 1.20 ల‌క్ష‌ల మంది ఓవ‌ర్‌సీస్ ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నారు. అయితే వీరిలో కేవ‌లం 2,958 మంది మాత్ర‌మే ఓటు వేయ‌డానికి పోలింగ్ రోజు స్వ‌దేశానికి రావ‌డం గ‌మ‌నార్హం. కేర‌ళ నుంచి అత్య‌ధికంగా 89 వేల మంది ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడించాయి.