News August 27, 2024

టెలిగ్రామ్‌పై బ్యాన్ త‌ప్ప‌దా..?

image

నేరపూరిత కార్యకలాపాల్లో అభియోగాలు రుజువైతే టెలిగ్రామ్‌పై భార‌త్‌లో కూడా నిషేధం త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దేశంలో 20 కోట్ల డౌన్‌లోడ్స్ ఉన్న టెలిగ్రామ్‌పై నకిలీ సిమ్‌ కార్డుల విక్రయం, సైబర్ మోసాలు, అశ్లీలత, నకిలీ పెట్టుబడి మోసాలు, కాపీరైట్‌ ఉల్లంఘనలు వంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై భారత ప్రభుత్వం విచారణ జరుపుతోంది. తాజాగా CEO పావెల్ దురోవ్ అరెస్టుతో విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

Similar News

News January 7, 2026

12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

image

AP: శ్రీశైలంలో ఈ నెల 12-18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 12న 9.15amకు స్వామివారి యాగశాల ప్రవేశం, బ్రహ్మోత్సవ సంకల్ప పఠనం ఉంటుంది. 13 నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న సంక్రాంతి వేళ బ్రహ్మోత్సవ కళ్యాణం జరిపిస్తారు. 18న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 12-18వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలు నిలిచిపోనున్నాయి.

News January 7, 2026

వివాహ ఆటంకాలను తొలగించే సర్ప దోష నివారణ

image

జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో రాహువు లేదా కేతువు ఉన్నప్పుడు సర్ప దోషం ఏర్పడుతుంది. దీనివల్ల సంబంధాలు చివరి నిమిషంలో చెడిపోతుంటాయి. ఈ దోష నివారణకు కాళహస్తి వంటి క్షేత్రాల్లో రాహు-కేతు శాంతి పూజ చేయించుకోవడం ఉత్తమం. ఇంట్లో రోజూ దుర్గా చాలీసా పఠిస్తే రాహువు ప్రభావం తగ్గుతుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి.

News January 7, 2026

25 రన్స్ చేస్తే సచిన్‌ను దాటనున్న కోహ్లీ!

image

ఈ నెల 11న ప్రారంభమయ్యే NZతో వన్డే సిరీస్‌లో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశాలున్నాయి. మరో 25 పరుగులు చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వేగంగా 28వేల పరుగులకు చేరుకున్న క్రికెటర్‌గా నిలవనున్నారు. కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్‌లో 27,975 రన్స్ చేశారు. మరోవైపు 28వేల రన్స్ మైలురాయిని అందుకోవడానికి సచిన్‌కు 644 ఇన్నింగ్స్ అవసరం కాగా, సంగక్కర 666 ఇన్నింగ్స్‌ ఆడారు.