News January 19, 2025
టిక్‌టాక్‌పై నిషేధం.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికాలో టిక్‌టాక్ యాప్ బ్యాన్పై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తమ దేశంలోని ఇన్వెస్టర్లు అందులో 50శాతం వాటా పొందేందుకు అనుమతి ఇస్తే ఆ యాప్‌పై బ్యాన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. కాగా మరికొన్ని గంటల్లో ట్రంప్ US అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ఈ యాప్ US యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటూ అక్కడి సుప్రీంకోర్టు <<15193540>>టిక్‌టాక్‌ను<<>> నిషేధించిన విషయం తెలిసిందే.
Similar News
News December 4, 2025
‘స్పిరిట్’ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్’ స్పెషల్ ప్రీమియర్ కోసం జపాన్‌కు వెళ్లారు. డిసెంబర్ 5, 6న జరిగే ప్రీమియర్స్‌కు ఆయన హాజరవుతారు. డిసెంబర్ 12న ఈ సినిమా అక్కడ విడుదల కానుంది. ‘కల్కి 2898 AD’ ప్రమోషన్ల సమయంలో జపాన్ అభిమానులను కలవలేకపోయిన ప్రభాస్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈసారి వారిని కలవనున్నారు. దీని కారణంగా ఇటీవల ప్రారంభమైన ‘స్పిరిట్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.
News December 4, 2025
PG కన్వీనర్ కోటా మిగులు సీట్ల భర్తీకి అనుమతి

AP: PGCET-2025లో కన్వీనర్ కోటాలో మిగులు సీట్ల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. వర్సిటీలు, కాలేజీల్లోని M.A, M.Sc, M.Com తదితర PG సీట్లను సంస్థలు భర్తీచేసుకోవచ్చు. సెట్లో అర్హత సాధించకున్నా, ఆ పరీక్ష రాయకున్నా నిర్ణీత అర్హతలున్న వారితో సీట్లను భర్తీ చేయవచ్చంది. ఈ వెసులుబాటు ఈ ఒక్కసారికే వర్తిస్తుందని పేర్కొంది. కాగా ఇలా చేరిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంటు వర్తించదని స్పష్టం చేసింది.
News December 4, 2025
అదనపు సిబ్బందిని తీసుకోండి.. SIRపై సుప్రీంకోర్టు

‘SIR’ విధుల్లో ఒత్తిడితో BLOల <<18435836>>ఆత్మహత్య<<>> ఘటనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇబ్బందులు వచ్చినప్పుడు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. పని గంటలనూ తగ్గించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ECతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, అయితే సరైన కారణంతో విధుల నుంచి మినహాయింపు కోరితే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.


