News October 1, 2024

హైదరాబాద్‌లో డీజే వినియోగంపై నిషేధం

image

డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో DJ సౌండ్ మిక్సర్‌లు, యాంప్లిఫయర్‌, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చారు. డీజేల నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందన్నారు.

Similar News

News December 6, 2025

కృష్ణా: పరీక్ష రాసి ఇంటికి వస్తూ.. విద్యార్థిని మృతి

image

మచిలీపట్నానికి చెందిన సుమయ్య (18) గుంటూరు (D) తాడేపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈమె SRM యూనివర్సిటీలో BBA చదువుతోంది. యూనివర్సిటీలో పరీక్షకు హాజరై స్నేహితుడితో కలిసి బైకుపై విజయవాడకు వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ క్రమంలో ఓ లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె స్నేహితుడు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.

News December 6, 2025

సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ గ్లాస్& సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 28 సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్ , పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.1,32,660 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.cgcri.res.in