News April 24, 2024

లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజురోజుకీ పెరుగుతోంది: లోకేశ్

image

AP: సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ‘ఆ రాయి కోడికత్తి చరిత్రను తిరగరాసింది. చీకట్లో లక్ష్యం తప్పకుండా ప్యాలస్ రాయి రెండు పిట్టలను కొట్టేసింది. లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ”కట్టు”కథలు మే 13న కంచికి చేరుతాయి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News March 11, 2026

ప.గో: గ్యాస్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

image

గ్యాస్ బుకింగ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జిల్లాలో వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. ఓవైపు సిలిండర్ ధరలు పెరగగా మరోవైపు గతంలో సింగిల్ బండ 15 రోజులు బుక్ చేసుకునే సౌకర్యం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం సింగిల్ బండ ఓనర్ 25 రోజుల తర్వాత, డబుల్ బండ వారు 30రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధన భారంగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు.

News March 11, 2026

చైనా FDIలు.. వ్యూహాత్మక గాలమా?

image

గల్వాన్ ఘర్షణ తర్వాత టిక్‌టాక్ బ్యాన్, చైనా వస్తువుల బహిష్కరణతో దేశం హోరెత్తిపోయింది. కానీ నేడు సీన్ మారింది. చైనా కంపెనీల <<19346681>>పెట్టుబడులకు<<>> (FDI) కేంద్రం రూల్స్ మార్చింది. ఇది వ్యూహాత్మక మార్పా? లేక ఆర్థిక అవసరమా? అనే చర్చ జరుగుతోంది. దేశీయ తయారీ రంగం బలోపేతం కోసం డ్రాగన్‌తో చేతులు కలిపిందని పలువురు విశ్లేషిస్తున్నారు. అలాగే చైనాను దారితెచ్చుకోవడానికి వేసిన గాలం అని మరికొందరు అంటున్నారు.

News March 11, 2026

ఫిరాయింపు MLAల కేసు.. సంచలన తీర్పు

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారు పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. స్పీకర్ తాజా నిర్ణయంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ లభించినట్లయింది.