News November 28, 2024

ఎల్లుండి ప్రభుత్వ స్కూళ్ల బంద్

image

TG: ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 30న పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు SFI రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపింది. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి, రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది.

Similar News

News December 6, 2025

విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం కఠిన చర్యలు

image

ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఇతర విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్‌ ధరలు పెంచడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఛార్జీల క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేసింది. సర్వీసులు రద్దైన అన్ని రూట్లలో కొత్తగా నిర్ణయించిన ధరలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని.. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని పేర్కొంది.

News December 6, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

image

AP: ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 2 నుంచి 13 వరకు 9AM నుంచి 12PM వరకు ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి 28 వరకు 9.30AM నుంచి 12.30PM వరకు జరుగుతాయి.
వెబ్‌సైట్: https://apopenschool.ap.gov.in/

News December 6, 2025

సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

image

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.