News March 31, 2025
కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి ఫైర్

తెలంగాణలో హరిత విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, BRS ఒక్కటేనని దుయ్యబట్టారు. గతంలో BRS హయాంలో కాళేశ్వరం నిర్మాణానికి 25 లక్షల చెట్లను తొలగించారన్నారు. ఇప్పుడు గచ్చిబౌలిలోని HCUలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తోందని ఫైరయ్యారు. అటవీ మాఫియాలో తెలంగాణ బందీ అయిందన్నారు. గొడ్డలి మారలేదని, పట్టిన చేతులు మారాయని విమర్శించారు.
Similar News
News April 2, 2025
DANGER: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా?

స్మార్ట్ ఫోన్లలో విపరీతంగా రీల్స్, షార్ట్స్ చూడటం వ్యసనంగా మారింది. దీనివల్ల బ్రెయిన్ రాట్(మేధో క్షీణత), కంటి జబ్బులు అధికమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లల్లో మెల్లకన్ను, డ్రై ఐ సిండ్రోమ్, మయోపియా కేసులు, పెద్దల్లో మైగ్రేన్, నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు. 20-20-20 రూల్(20ని.కోసారి 20సె.పాటు 20మీ. దూరంలో వస్తువులపై దృష్టి పెట్టడం) పాటించాలని సూచిస్తున్నారు.
News April 2, 2025
నేడు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. బిల్లుపై చర్చకు 8 గంటలు కేటాయిస్తున్నట్లు అధికారపక్షం తెలపగా, 12 గంటలు కేటాయించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతేనే సభా సమయం పొడిగిస్తామని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. ఈ బిల్లును కాంగ్రెస్, TMC, SP, MIM, DMK వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
News April 2, 2025
టాప్-2లోకి దూసుకొచ్చిన PBKS

LSGపై ఘన విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి దూసుకొచ్చింది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. కాగా ఈ మూడు జట్లు ఇప్పటివరకూ కప్ కొట్టకపోవడం గమనార్హం. తర్వాతి స్థానాల్లో GT, MI, LSG, CSK, SRH, RR, KKR ఉన్నాయి.