News April 4, 2024

బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట

image

TG: బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 11 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ చేయాల్సి వస్తే సీఆర్‌పీసీ 41 నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 27న చెంగిచర్లలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య జరిగిన గొడవలో గాయపడిన వారిని పరామర్శించేందుకు సంజయ్ వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదైంది.

Similar News

News November 28, 2025

వనపర్తి: ఓటర్లను ప్రలోభ పెట్టొద్దు: పరిశీలకులు

image

వనపర్తి జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు సూచించారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా పార్టీలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎంసీసీ) తూచా తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

News November 28, 2025

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం

News November 28, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.