News June 16, 2024

మెదక్ ఘటనపై పోలీసులకు బండి సంజయ్ ఫోన్

image

TG: మెదక్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. నిందితులపై కఠినంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అమాయకులపై కేసులు పెట్టొద్దంటూ బండి హెచ్చరించినట్లు సమాచారం. మెదక్‌లో గోవధకు ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే.

Similar News

News January 4, 2025

అత్యధిక లాభాలొచ్చిన సినిమా.. రూ.3కోట్లకు రూ.136 కోట్లు

image

తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మ‌ల‌యాళ సినిమాల్లో ‘ప్రేమలు’ ఒకటి. తన స్నేహితులతో కలిసి ఫహాద్ ఫాజిల్ నిర్మించిన ఈ చిత్రం 2024లో భారతదేశంలో అత్యంత లాభదాయకమైన మూవీగా నిలిచింది. కేవలం రూ.3కోట్లతో యువ నటీనటులతో నిర్మించిన ఈ సినిమాకు ఏకంగా రూ.136 కోట్లు వచ్చాయి. అంటే ఏకంగా 45 రెట్లు లాభం వచ్చిందన్నమాట. ‘పుష్ప-2’కు రూ.1800 కోట్లు కలెక్షన్లు వచ్చినా దానిని రూ.350 కోట్లతో నిర్మించారు.

News January 4, 2025

వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ: మంత్రి అచ్చెన్న

image

AP: వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తే తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరు విజ్ఞాన్ వర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అగ్రికల్చర్‌లో డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెడతామని, యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలో రైతులకు అందిస్తామన్నారు.

News January 4, 2025

ట్రాఫిక్ సమస్యలో బెంగళూరు టాప్!

image

నగరాలు అభివృద్ధి చెందుతుంటే అంతే వేగంగా ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతుంటాయి. వాహనాలు పెరగడంతో ఒక్కోసారి ఒక్క కిలోమీటర్ వెళ్లేందుకు పది నిమిషాలు పడుతుంటుంది. అయితే, ఆసియాలోని నగరాల్లో అత్యధికంగా బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని తేలింది. 10kms వెళ్లేందుకు ఇక్కడ 28.10 నిమిషాలు పడుతుంది. అదే దూరం వెళ్లేందుకు పుణేలో 27.50ని, మనీలాలో 27.20ని, తైచుంగ్‌లో 26.50ని, సపోరోలో 26.30నిమిషాలు పడుతుంది.