News September 24, 2024
పవన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ మద్దతు

సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతిచ్చారు. ఎవరైనా సనాతన ధర్మం జోలికి వస్తే హిందువులంతా గొంతెత్తుతామని చెప్పారు. సెక్యులరిజం రెండు దారులున్న వీధి లాంటిదన్నారు. ఇకపై తాము మౌనంగా ఉండబోమని బండి స్పష్టం చేశారు.
Similar News
News January 18, 2026
పల్నాడులో YCP రక్తం పారిస్తే.. TDP నీళ్లు పారిస్తోంది: గొట్టిపాటి

AP: పల్నాడులో YCP హయాంలో రక్తం పారితే కూటమి ప్రభుత్వంలో సాగునీరు పారుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులిమి YCP కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా <<18871169>>జగన్<<>>కు బుద్ధి రాలేదని, శవ రాజకీయాలకు పాకులాడుతున్నారని విమర్శించారు. అక్రమ సంపాదనతో పుట్టిన YCPకి, ఆత్మగౌరవం కోసం పెట్టిన TDPకి మధ్య తేడా ఉందన్నారు.
News January 18, 2026
కర్ణుడి దానగుణం: మానవత్వమే పరమార్థం

మహాభారత యుద్ధంలో కర్ణుడి దానపుణ్యమే అతడికి రక్షగా నిలిచింది. చివరి క్షణంలో కృష్ణుడు అడిగినప్పుడు కర్ణుడు తన పుణ్యఫలాన్ని కూడా దానమిచ్చాడు. వరం కోరమని అడగ్గా.. మరుజన్మలోనూ సాయం చేసే హృదయాన్నే కోరుకున్నాడు. ముక్తి కోసం దేవుడిని వెతకక్కర్లేదని, తోటివారికి సాయపడే గుణం ఉంటే ఆ దేవుడే మనల్ని చేరుకుంటాడని ఈ కథ నిరూపిస్తోంది. పరోపకారమే నిజమైన దైవారాధనని కర్ణుడి జీవితం చాటిచెబుతోంది.
News January 18, 2026
C-DOTలో సైంటిస్ట్ పోస్టులు

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(<


