News January 19, 2025

పవన్, లోకేశ్‌తో బండి సంజయ్ చిట్‌చాట్

image

AP: కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా మరో మంత్రి బండి సంజయ్ కూడా ఆయన వెంట వచ్చారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌తో సంజయ్ కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించి ఫొటోలను ఆయన తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Similar News

News November 21, 2025

అక్టోబర్‌లో ట్యాక్స్ రెవెన్యూ రూ.16,372 కోట్లు

image

TG: అక్టోబర్‌లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్లు సమకూరినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాల ద్వారానే రూ.3,675Cr వచ్చినట్లు పేర్కొంది. అక్టోబర్ రెవెన్యూతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఖజానాకు చేరిన మొత్తం రూ.88,209.10Crకు పెరిగింది. FY26లో పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35Cr వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు 50.31% సమకూరింది.

News November 21, 2025

సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనుగోలు చేయొచ్చు

image

AP: శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్‌లెట్ కూడా అందుతుంది. ఆన్‌లైన్ పేమెంట్‌తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.

News November 21, 2025

మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

image

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్‌ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.