News December 29, 2024
రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నింగ్
TG: సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పండగ తర్వాత ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
Similar News
News January 1, 2025
రికార్డు సృష్టించిన బుమ్రా
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పారు. ICC టెస్టు ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచారు. గత వారం <<14977764>>అశ్విన్(904p) రికార్డును<<>> సమం చేసిన ఆయన మెల్బోర్న్ టెస్టు ప్రదర్శనతో దానిని అధిగమించారు. ప్రస్తుతం బుమ్రా టెస్టుల్లో తొలి ర్యాంకులో ఉండగా హేజిల్‌వుడ్, కమిన్స్, రబాడ, జాన్సెన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
News January 1, 2025
దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ ఇదే
JSW MG Windsor EV రికార్డులు తిరగరాస్తోంది. వరుసగా మూడో నెలా అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. SEPలో 3116, OCTలో 3144, DECలో 3785 యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రూ.13.50L-15.50L లభిస్తున్న ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332km నడుస్తుంది. Tata Tiago.ev, Tata Punch.ev, Tata Nexon.ev, Tata Curvv.ev, Mahindra XUV400, Citroen E-C3 వంటి బడ్జెట్ కార్లు దీనికి పోటీనివ్వలేకపోతున్నాయి.
News January 1, 2025
న్యూఇయర్ విషెస్ లింక్ క్లిక్ చేస్తున్నారా?
కొత్త సంవత్సరాన్ని సైబర్ నేరగాళ్లు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. విషెస్ పేరుతో లింక్‌లు పంపిస్తూ పర్సనల్ డేటాను చోరీ చేసి, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. కొందరు తెలియక వీటిని ఫార్వర్డ్ చేస్తున్నారు. అందుకే మీకు ఎంత దగ్గరివారైనా న్యూఇయర్ సందర్భంగా పంపే లింక్‌లను క్లిక్ చేయకపోవడం బెటర్. ఫ్రీ రీఛార్జ్, భారీ డిస్కౌంట్లు, తక్కువ ధరకే న్యూఇయర్ ఈవెంట్ పాస్‌లు వంటి లింక్‌లకు దూరంగా ఉండండి.
SHARE IT