News February 25, 2025
బండి విజ్ఞతతో మాట్లాడాలి: టీపీసీసీ చీఫ్

TG: కాంగ్రెస్ పార్టీని పాకిస్థాన్ టీమ్‌తో పోల్చుతూ కేంద్ర మంత్రి <<15574950>>బండి సంజయ్<<>> చేసిన వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు. రాజకీయాలను క్రికెట్‌ను ముడిపెట్టకుండా విజ్ఞతతో మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర రాజకీయాలు తెలియకుండా మాట్లాడొద్దని మండిపడ్డారు. గత పదేళ్లలో BRS చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సంక్షేమానికి పెద్ద పీట వేశామని తెలిపారు.
Similar News
News November 22, 2025
మానిటైజేషన్‌లో SEC, చెన్నై సహా 100 స్టేషన్లు

రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌లో భాగంగా సికింద్రాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ సహ 100 ప్రధాన స్టేషన్ల పరిధిలోని భూమి, కమర్షియల్ స్పేస్‌ను కేంద్రం లీజుకు ఇస్తుంది. ప్రయివేటు పెట్టుబడులతో సరకు రవాణా రైళ్లను ప్రవేశపెడుతుంది. మానిటైజేషన్ 1.0లో ₹1.5 లక్షల CR వస్తుందని అంచనా వేయగా కేవలం ₹28,717 CR సాధించింది. దీంతో 2.0లో భూమి, కమర్షియల్ స్పేస్‌పై రైల్వే దృష్టి సారించింది. 5 ఏళ్లలో దీన్ని పూర్తి చేయనుంది.
News November 22, 2025
₹2.5 లక్షల కోట్ల రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌కు చర్యలు

రైల్వే విభాగంలోని ₹2.5లక్షల కోట్ల ఆస్తులను 2025-30 మధ్య మానిటైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్-02 కింద ఈ ప్రక్రియను చేపడుతుంది. 2029-30 నాటికి ₹10లక్షల CR మానిటైజేషన్‌కు చేయనున్నామని కేంద్రం FEB బడ్జెట్లో వెల్లడించడం తెలిసిందే. విభాగాల వారీగా మానిటైజ్‌కు వీలైన ఆస్తులపై ప్రణాళికలు సిద్ధం చేసింది. రైల్వే ఆస్తులను PPP, మల్టీ అసెట్స్ అప్రోచ్ మోడల్లో మానిటైజ్ చేస్తారు.