News September 24, 2024

బెంగళూరు ఖాళీ అవుతుంది: ఇన్‌ఫ్లుయెన్సర్ వ్యాఖ్యలపై దుమారం

image

ఉత్త‌ర భార‌త ప్ర‌జ‌లు బెంగ‌ళూరును వీడితే న‌గ‌రం మొత్తం ఖాళీ అవుతుంద‌ని, ఇక్క‌డ డ‌బ్బు కొర‌త ఏర్ప‌డుతుందని ఒక ఇన్‌ఫ్లుయెన్స‌ర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. ‘క‌న్న‌డిగులు త‌ర‌చూ మ‌మ్మ‌ల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమంటూ హేళన చేస్తుంటారు. మేము నిజంగానే వెళ్లిపోతే మీ న‌గ‌రం ఖాళీ అయిపోతుంది’ అంటూ సుగంధ్ శర్మ వ్యాఖ్యానించారు. కొంత మంది ఆమెపై భగ్గుమంటున్నారు. నగరం విడిచి వెళ్లాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News October 18, 2025

వంటింటి చిట్కాలు

image

* కిస్‌మిస్‌లు నిల్వ చేసే ముందు రెండు స్పూన్ల బియ్యప్పిండిని వాటికి పట్టిస్తే ఎన్ని రోజులైనా అతుక్కోకుండా ఉంటాయి.
* నూనె డబ్బాలు ఎంత తోమినా జిడ్డుగానే ఉంటాయి. అప్పుడు కాస్త క్రిస్టల్ సాల్ట్, డిష్ వాష్ లిక్విడ్ వేసిన నీటిలో డబ్బాను కాసేపు నానబెట్టి స్క్రబ్బర్‌తో రుద్దాలి. దీంతో జిడ్డంతాపోయి తళతళా మెరుస్తాయి.
* చేపలు శుభ్రం చేసిన తర్వాత శెనగపిండి పట్టించి 5 నిమిషాల తర్వాత కడిగితే నీచు వాసన పోతుంది.

News October 18, 2025

బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

image

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.

News October 18, 2025

పిల్లల ప్రశ్నలను గౌరవించి రిప్లై ఇవ్వండి: వైద్యులు

image

పిల్లల సృజనాత్మకత పెరగాలంటే వారు ప్రశ్నలు అడగటాన్ని ప్రోత్సహించాలని మానసిక వైద్యుడు శ్రీకాంత్‌ సూచించారు. ‘ఐదేళ్ల లోపు చిన్నారులు రోజుకు సుమారు 300 ప్రశ్నలు అడుగుతారు. ఇది వారి అపారమైన ఉత్సుకతకు నిదర్శనం. తల్లిదండ్రులు వారి ప్రశ్నలకు ఓపిగ్గా జవాబివ్వడం, తెలియని వాటికి తెలుసుకొని చెప్తా అనడం చాలా ముఖ్యం. ప్రశ్నించడాన్ని అణచివేస్తే వారు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోవచ్చు’ అని హెచ్చరించారు.