News January 4, 2025
ట్రాఫిక్ సమస్యలో బెంగళూరు టాప్!
నగరాలు అభివృద్ధి చెందుతుంటే అంతే వేగంగా ట్రాఫిక్ సమస్యలు వెంటాడుతుంటాయి. వాహనాలు పెరగడంతో ఒక్కోసారి ఒక్క కిలోమీటర్ వెళ్లేందుకు పది నిమిషాలు పడుతుంటుంది. అయితే, ఆసియాలోని నగరాల్లో అత్యధికంగా బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని తేలింది. 10kms వెళ్లేందుకు ఇక్కడ 28.10 నిమిషాలు పడుతుంది. అదే దూరం వెళ్లేందుకు పుణేలో 27.50ని, మనీలాలో 27.20ని, తైచుంగ్‌లో 26.50ని, సపోరోలో 26.30నిమిషాలు పడుతుంది.
Similar News
News January 6, 2025
ఆందోళన వద్దు.. మీరోజు కోసం వేచి ఉండండి!
ఇద్దరూ ఒకేసారి ప్రారంభించినప్పటికీ నీ స్నేహితుడు ముద్దాడిన విజయం మీ దరిచేరలేదని ఆందోళన పడుతున్నారా? ఓసారి పైనున్న ఈ ఫొటో చూడండి. రెండు జామకాయలు ఒకేసారి పక్కపక్కనే పెరిగినా, ఒకటి మాత్రం పండుగా మారింది. అచ్చం ఇలానే విజయం కోసం మీ సమయం వచ్చేవరకూ వేచి ఉండాలి. నిరాశతో మీరు ఫెయిల్ అయ్యారని అనుకోకుండా మీరోజు కోసం వేచి ఉండండి. విజయంలో ఉన్న స్వీట్నెస్ను రుచిచూడండి.
News January 6, 2025
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు
TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ <<15069986>>పోలీసులు మరోసారి<<>> నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన వెళ్తే గంటలోగా పర్యటన పూర్తి చేసుకోవాలన్నారు. దీనిని రహస్యంగా ఉంచాలని, ఎస్కార్ట్ భద్రత కల్పిస్తామన్నారు.
News January 6, 2025
కేంద్రం సహకరిస్తే ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాం: CM
TG: మెట్రో రైలు విస్తరణకు, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని అన్నారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వాలని కోరారు.