News March 7, 2025
బెంగళూరు యూనివర్సిటీకి మన్మోహన్ పేరు

బెంగళూరు యూనివర్సిటికీ మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ పేరు పెట్టనున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. దివంగత నేత పేరును విశ్వవిద్యాలయానికి పెట్టడం దేశంలోనే తొలిసారన్నారు. మాజీ ప్రధాని సంస్కరణల వల్ల జరిగిన అభివృద్ధి భావితరాలకు తెలిసేలా రీసెర్చ్, స్టడీసెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు Dy Cm డీకే శివకుమార్ తెలిపారు. 1991లో సింగ్ తెచ్చిన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాయి.
Similar News
News January 10, 2026
పుష్య మాసం శనీశ్వరుడికి ఎందుకు ఇష్టం?

పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరం. అందుకు కారణం ఆయన జన్మనక్షత్రం. శని దేవుడు పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. చంద్రుడు పుష్యమి నక్షత్రంతో ఉండే మాసమే పుష్యమి కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు ఆయన త్వరగా అనుగ్రహిస్తాడని నమ్మకం. శని దోషాలు ఉన్నవారు ఈ మాసంలో శని దేవుడికి తైలాభిషేకం, నువ్వుల దానం చేయడం వల్ల పీడలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే శని గ్రహ శాంతికి ఈ మాసం అత్యంత శ్రేష్ఠమైనది.
News January 10, 2026
వొడాఫోన్ ఐడియాకు కేంద్రం భారీ ఊరట

అప్పుల భారంతో కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇటీవల AGR బకాయిల చెల్లింపుల్లో పాక్షిక <<18724413>>మారటోరియం<<>> ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 నుంచి 2032 వరకు ఆరేళ్లపాటు ఏటా రూ.124 కోట్లు, ఆ తర్వాత నాలుగు ఏళ్లపాటు ఏటా రూ.100 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మొత్తం రూ.87,695 కోట్ల బకాయిల్లో వచ్చే పదేళ్లలో రూ.1,144 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
News January 10, 2026
తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం గంటకు 13 KM వేగంతో శ్రీలంక వైపు కదులుతోంది. ఈరోజు సాయంత్రంలోపు ట్రింకోమలీ-జాఫ్నా మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.


