News August 17, 2025
యూత్ మెచ్చిన సిటీగా బ్యాంకాక్

ప్రపంచంలోని 30 ఏళ్లలోపు యువత (Gen Z) మెచ్చిన నగరంగా బ్యాంకాక్ నిలిచింది. ధరలు, కల్చర్, నైట్ లైఫ్, క్వాలిటీ లైఫ్ ఈ నాలుగు లక్షణాలు ఆ సిటీలో ఉండటంతో వారు బ్యాంకాక్ వైపు మొగ్గుచూపుతున్నట్లు టైమ్ అవుట్ సర్వేలో తేలింది. ఇందులో రెండో నగరంగా మెల్‌బోర్న్, మూడో స్థానంలో కేప్ టౌన్ నిలిచాయి. న్యూయార్క్, కోపెన్ హాగన్, బార్సిలోనా, ఎడిన్ బర్గ్, మెక్సికో సిటీ, లండన్, షాంఘై నగరాలు టాప్-10లో నిలిచాయి.
Similar News
News August 17, 2025
ఆసియా కప్‌కు పాక్ జట్టు ప్రకటన.. సీనియర్ ప్లేయర్లకు షాక్

SEP 9 నుంచి జరిగే ఆసియా కప్(T20)కు పాక్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లకు చోటు దక్కలేదు. సల్మాన్ అలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: సల్మాన్ అలీ అఘా (C), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, H నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, M హరీస్(WK), M నవాజ్, వసీమ్ Jr, సహిబ్జాదా ఫర్హాన్, S అయూబ్, S మీర్జా, షాహీన్ ఆఫ్రిది, సుఫియాన్ మొకిమ్.
News August 17, 2025
రవితేజ ‘మాస్ జాతర’ విడుదల వాయిదా?

మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని అక్టోబర్ 20కి పోస్ట్‌పోన్ చేస్తారని సమాచారం. సినీ కార్మికుల సమ్మె వల్ల పెండింగ్ వర్క్ పూర్తి కాలేదని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News August 17, 2025
సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో ఈ ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సందిగ్ధత, ఎన్నికల నిర్వహణకు కోర్టు విధించిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ వచ్చేందుకు కీలకంగా భావిస్తున్న PAC సమావేశం తేదీ ఖరారుపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.