News December 6, 2024

భారత సరిహద్దుల్లో బంగ్లా డ్రోన్లు

image

భారత్‌తో సరిహద్దుల్లో బంగ్లాదేశ్ బేరక్తర్ టీబీ2 డ్రోన్లను మోహరించినట్లు సమాచారం రావడంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల వెంబడి నిఘాను పెంచింది. మానవరహిత టీబీ2 డ్రోన్లను బంగ్లాదేశ్ టర్కీనుంచి దిగుమతి చేసుకుంది. కాగా, మాజీ పీఎం హసీనా హయాంలో అణచివేసిన ఉగ్రమూకలు ఆ దేశ సరిహద్దుల్లో ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నట్లు సమాచారం. బెంగాల్ మీదుగా భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 19, 2025

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 50 పోస్టులు

image

పుణేలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దేహు రోడ్ 50 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్‌తో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు నవంబర్ 7లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://munitionsindia.in/career/

News October 19, 2025

వరి కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వరి కోత సమయంలో గింజలో 22-27 శాతం తేమ ఉంటుంది. నూర్పిడి చేశాక ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై 3 నుంచి 4 రోజుల పాటు పలుచగా ఆరబెట్టాలి. దీని వల్ల గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. నూర్పిడి చేశాక ఒకసారి తూర్పార పడితే పంట అవశేషాలు, తాలుగింజలు పోతాయి. మార్కెట్‌లో కనీస మద్దతు ధర రావాలంటే దెబ్బతిన్న, మొలకెత్తిన, పుచ్చుపట్టిన గింజలు 4 శాతం మించకుండా చూసుకోవాలి.

News October 19, 2025

ధన్వంతరి స్వామి చేతిలో జలగ ఎందుకు?

image

ఆయుర్వేదంలో ‘రక్త మోక్షణం’ అనే ఓ ముఖ్యమైన చికిత్స ఉంటుంది. దీనర్థం రక్తాన్ని శుద్ధి చేయడం. ఈ చికిత్సలో భాగంగా శరీరంలోని చెడు రక్తాన్ని సురక్షితంగా బయటకు తీయడానికి జలగను వాడతారు. అవి రోగగ్రస్తమైన రక్తాన్ని మాత్రమే పీల్చి, ఆ భాగానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రోగాలను నివారించే, చికిత్స చేసే వైద్య విధానాన్ని సూచించడానికి ధన్వంతరి స్వామి తన ఔషధ పాత్రతో పాటు జలగను కూడా ధరించి దర్శనమిస్తారు.