News August 7, 2024
బంగ్లా అల్లర్లు: భారత రాయబారుల తరలింపు
బంగ్లాదేశ్ అట్టుడుకుతుండటంతో అక్కడి రాయబార కార్యాలయాల సిబ్బందిని భారత్ ఖాళీ చేయించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వల్ప సంఖ్యలో అధికారులు మాత్రం భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించాయి. వీరిలో ఢాకాలోని భారత హైకమిషనర్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. బంగ్లాలోని చిట్టగాంగ్, రాజ్‌షాహీ, ఖుల్నా, సిల్హెట్ వంటి నగరాల్లో భారత రాయబార కార్యాలయాలున్నాయి.
Similar News
News January 16, 2025
హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
News January 16, 2025
కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్
హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.
News January 16, 2025
ఆరు వారాలే ఒప్పందం!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు అమలులో ఉండనున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడనున్నాయి. దీంతో పాటు ఇరు వర్గాలు బందీలను విడుదల చేసేందుకు పరస్పరం అంగీకారం తెలిపాయని వెల్లడించాయి.