News December 21, 2024
బంగ్లాదేశ్: 3 ఆలయాలు, 8 విగ్రహాలు ధ్వంసం

బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా మైమెన్సింగ్, దినాజ్పూర్లోని 3 ఆలయాల్లో 8 విగ్రహాలను ముష్కరులు ధ్వంసం చేశారు. గురు, శుక్రవారాల్లో మైమెన్సింగ్లోని 2 గుళ్లలో 3 మూల విరాట్టులను పగలగొట్టారని పోలీసులు తెలిపారు. కేసు నమోదవ్వలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. పొలాష్ఖండ్ కాళీ మందిరం దాడి ఘటనలో అలాలుద్దీన్ (27)ను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
Similar News
News December 7, 2025
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో ఉద్యోగాలు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(<
News December 7, 2025
12 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు

AP: వివిధ పర్వదినాలను పురస్కరించుకొని DEC, JANలలో TTD 12 రోజులు VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ‘DEC 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన DEC 29 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, JAN 25న రథసప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు ఉండవు’ అని ప్రకటించింది. ఈ రోజులకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు సహకరించాలని కోరింది.
News December 7, 2025
కూరగాయల పంటల్లో వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు

వైరస్ తెగుళ్ల కట్టడికి రసం పీల్చే పురుగులను నివారించడం ముఖ్యం. అలాగే రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాల ఎంపిక, పంట మార్పిడి, అంతర పంటలను సాగు చేయాలి. పంట పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న పంటలను కంచె పంటగా సాగు చేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. విత్తనం నాటే ముందు పొలానికి ట్రైకోడెర్మా, వేపపిండి కలిపి వేయడం, గుళికలమందు వాడకం, విత్తనశుద్ధి మంచి ఫలితాలిస్తాయి.


