News December 22, 2024

భారత్‌పై మరోసారి బంగ్లా ఆరోపణలు

image

మాజీ ప్రధాని షేక్ హ‌సీనా హ‌యాంలో ప్ర‌జ‌లు అదృశ్యమైన ఘ‌ట‌న‌ల్లో భార‌త్ హ‌స్తం ఉంద‌ని బంగ్లా ప్ర‌భుత్వ ఎంక్వైరీ క‌మిష‌న్ ఆరోపించింది. బంగ్లా ఖైదీలు భార‌తీయ జైళ్ల‌లో మ‌గ్గుతున్నార‌ని పేర్కొంది. భార‌త్‌లో నిర్బంధంలో ఉన్న తమ జాతీయుల‌ను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బంగ్లాదేశ్ విదేశాంగ, హోం శాఖలకు క‌మిష‌న్ సిఫార్సు చేసింది. తమ పౌరులు 3,500 మంది అదృశ్యమైనట్టు కమిషన్ అంచనా వేసింది.

Similar News

News December 3, 2025

కడప: నవంబరులో తగ్గిన మద్యం ఆదాయం

image

కడప జిల్లాలో మద్యం ఆదాయం నవంబరులో భారీగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యంత కనిష్ఠ స్థాయిలో రూ.83.38 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.101.31 కోట్లు, మేలో రూ.98.90 కోట్లు, జూన్‌లో రూ.97.31 కోట్లు, జూలైలో రూ.96.47 కోట్లు, ఆగస్ట్‌లో రూ.96.42 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.93.36 కోట్లు, అక్టోబర్‌లో రూ.93.44 కోట్లు, నవంబర్‌లో రూ.83.38 కోట్లు ఆదాయం వచ్చింది.

News December 3, 2025

ప్రజలను కేంద్రం దగా చేస్తోంది: రాహుల్ గాంధీ

image

కుల గణనపై కేంద్రం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘పార్లమెంటులో కుల గణనపై నేనో ప్రశ్న అడిగా. దానికి కేంద్రం ఇచ్చిన సమాధానం విని షాకయ్యాను. సరైన ఫ్రేమ్ వర్క్ లేదు, టైమ్ బౌండ్ ప్లాన్ లేదు, పార్లమెంట్‌లో చర్చించలేదు, ప్రజలను సంప్రదించలేదు. కులగణనను విజయవంతంగా చేసిన రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలని లేదు. క్యాస్ట్ సెన్సస్‌పై మోదీ ప్రభుత్వ తీరు దేశంలోని బహుజనులను దగా చేసేలా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News December 3, 2025

NIEPMDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిఫుల్ డిజబిలిటీస్ (NIEPMD) 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG, B.Ed, M.Ed (Spl.edu), PhD, M.Phil, PG( సైకాలజీ, ఆక్యుపేషనల్ థెరపీ), డిగ్రీ (ప్రోస్థెటిక్స్&ఆర్థోటిక్స్), B.Com, M.Com, MBA, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://niepmd.nic.in