News July 22, 2024
సుప్రీం తీర్పుతో శాంతించిన బంగ్లాదేశ్

పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971 నాటి యుద్ధంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను ఆ దేశ సుప్రీం కోర్టు రద్దు చేసింది. వాటిని మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశించింది. దీంతో కొంతకాలంగా ఆ దేశంలో నెలకొన్న హింసాత్మక ఘటనలకు ఫుల్స్టాప్ పడింది. కాగా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పౌరులు చేపట్టిన ఆందోళనల్లో ఇప్పటి వరకు 115 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Similar News
News January 20, 2026
టెన్త్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు!

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్స్‌ను MAR 16-APR 1 వరకు నిర్వహిస్తామని SSC బోర్డు 2025 NOVలో వెల్లడించింది. MAR 20న ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని పేర్కొంది. అయితే ఆ రోజు రంజాన్ కావడంతో GOVT సెలవు ప్రకటించింది. దీంతో పరీక్షను MAR 21న జరిపే ఛాన్స్ ఉంది. కాగా కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ‘Way2News’కి తెలిపారు.
News January 20, 2026
దావోస్‌లో సీఎం టీమ్.. టార్గెట్ ఇన్వెస్ట్మెంట్స్

TG CM రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడిన బృందం దావోస్‌లో పెట్టుబడుల వేట మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీని వరల్డ్ క్లాస్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు UAE ప్రభుత్వంతో చేతులు కలిపింది. అటు ఇజ్రాయెల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీలు రాష్ట్రంలో ఏఐ సంబంధిత పైలట్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అంగీకరించాయి.
News January 20, 2026
మెట్రో ఫేజ్-2: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

TG: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2కు వీలైనంత త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి CM రేవంత్ లేఖ రాశారు. ఇదే విషయమై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. గతంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ కలిసినట్లు గుర్తుచేశారు. ఫేజ్-2 నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటును CM లేఖలో ప్రస్తావించారు.


