News June 11, 2024
అంపైర్ వల్ల ఓడిన బంగ్లాదేశ్!

నిన్న అంపైర్ తప్పుడు నిర్ణయం, ICC రూల్స్ వల్ల బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. సౌతాఫ్రికాపై 16.2వ బంతికి బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లాను అంపైర్ LBWగా ప్రకటించారు. ఆ బంతి ప్యాడ్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. బంగ్లా రివ్యూకు వెళ్లగా అది నాటౌట్ అని తేలింది. రూల్స్ ప్రకారం అంపైర్ నిర్ణయం తీసుకోగానే అది డెడ్ బాల్‌గా మారుతుంది. దీంతో బౌండరీ వెళ్లినా ఫోర్ ఇవ్వలేదు. చివరికి బంగ్లా 4 రన్స్ తేడాతో ఓడింది.
Similar News
News November 24, 2025
నకిలీ వెబ్సైట్ల కలకలం.. శ్రీశైలం భక్తులకు అలర్ట్

AP: శ్రీశైలంలో వసతులు కల్పిస్తామంటూ AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్ల ద్వారా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ₹30Kతో రూమ్స్ బుక్ చేశారు. అక్కడికి వచ్చి రశీదు చూపించగా సిబ్బంది నకిలీదని చెప్పడంతో షాకయ్యారు. ఇలాగే పలువురు మోసాలకు గురయ్యారు. దీంతో ఆయా వెబ్సైట్లపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News November 24, 2025
ఎన్నికలపై విచారణ వాయిదా

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.
News November 24, 2025
హనుమాన్ చాలీసా భావం – 19

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥
సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలో ఎగిరిన బలవంతుడు హనుమ. అలాంటిది శ్రీరాముని ఉంగరంతో సముద్రాన్ని దాటడం ఆశ్చర్యాన్ని కలిగించదు. హనుమంతుని అద్భుత శక్తులు తెలిసిన తర్వాత సముద్ర లంఘనం ఆయనకు ఎంతో సులువు అని కవి ఉద్దేశం. దైవకార్య సాధనలో ఎంత కష్టమైన పనైనా సునాయసంగా పూర్తవుతుందనే సందేశం ఈ దోహా ఇస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>


