News October 20, 2024
‘బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగొచ్చు’

బంగ్లాదేశ్‌లో 2025లో సాధారణ ఎన్నికలు జరగొచ్చని అక్కడి తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అంచనా వేశారు. ఎన్నికలు నిర్వహించడానికి ముందు చాలా అంశాలను పరిష్కరించాల్సి ఉందన్నారు. రాజకీయ సంస్కరణలు, సెర్చ్, ఎన్నికల కమిటీల ఏర్పాటు, ఓటరు జాబితా తయారీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్లతో PMగా షేక్ హసీనా తప్పుకుని దేశం వీడారు. అప్పటి నుంచి బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.
Similar News
News November 23, 2025
రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ్లోబల్ సమ్మిట్

DEC 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో TG ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు 2వేల మంది ప్రముఖులు రానున్నారు. రాష్ట్ర లక్ష్యాలు, ప్రణాళికలు వివరించేలా ప్రభుత్వం ‘TG రైజింగ్-2047’ డాక్యుమెంట్‌ను రూపొందించి ఆవిష్కరించనుంది. ఈ నెల 25 నుంచి CM రేవంత్ వివిధ శాఖలతో సమీక్షించి డాక్యుమెంట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడం, భారీగా పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యం.
News November 23, 2025
మూర్ఛ జన్యుపరమైన సమస్య

ఫిట్స్ ఒక దీర్ఘకాలిక రుగ్మత. దాదాపు 70% మూర్ఛ కేసులు జన్యుపరమైన కారణాలతో సంబంధం కలిగి ఉంటాయని వారు పేర్కొంటున్నారు. 2018లో ‘Neuron’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 622 మంది మూర్ఛ రోగుల DNAను అధ్యయనం చేయగా వారిలో మూర్ఛ వ్యాధికి కారణమయ్యే 19 కొత్త జన్యువులను పరిశోధకులు గుర్తించారట. ఈ జన్యు మార్పులు మెదడు కణాల మధ్య సంకర్షణను దెబ్బతీస్తాయని, ఫలితంగా మూర్ఛ వస్తుందని నిపుణులు గుర్తించారు.
News November 23, 2025
అంబానీ స్కూల్.. ఫీజులు తెలిస్తే షాకే!

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై) ఏడాది ఫీజులపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
*కిండర్‌గార్టెన్ నుంచి 7వ తరగతి: రూ.1.70 లక్షలు
*8-10th (ICSE): రూ.1.85 లక్షలు
*8-10th (IGCSE): రూ.5.9 లక్షలు
*11-12th (IBDP): రూ.9.65 లక్షలు
> షారుఖ్ ఖాన్, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్‌తో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.


