News March 28, 2025
చైనాకు దగ్గరవుతున్న బంగ్లా

పొరుగు దేశం బంగ్లాదేశ్ చైనాకు దగ్గరవుతోంది. చైనీస్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ జోన్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చైనాతో కలిసి పని చేస్తామని ప్రకటించింది. తాము తైవాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించబోమని, అది చైనాలో భాగమని స్పష్టం చేసింది. తమ దేశంలోని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల్లో చైనా భాగం కావాలని కోరింది. అలాగే చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తమ దేశానికి రావాలని బంగ్లా తాత్కాలిక చీఫ్ యూనస్ ఆహ్వానించారు.
Similar News
News February 2, 2026
బలమైన ప్రజాపక్షపాలన అందించేందుకు సిద్ధం: బీజేపీ

BJP ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగింది. గంట రవికుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి, పారదర్శకత, బాధ్యతాయుత పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే బీజేపీ లక్ష్యమన్నారు. మున్సిపాలిటీల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థలలో కూడా బలమైన ప్రజాపక్ష పాలన అందించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు.
News February 2, 2026
నాన్నకు ప్రేమతో.. కూతుళ్లు ఏం చేశారంటే?

కన్నతండ్రి జ్ఞాపకం కళ్లెదుటే ఉండాలని నల్గొండ జిల్లా కోతులారానికి చెందిన గౌరవతి, మమత తమ నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమను కొడుకుల్లా పెంచి, కంటిపాపలా చూసుకున్న వీరమళ్ల నర్సింహ గతేడాది అనారోగ్యంతో మరణించారు. నవమాసాలు మోయకపోయినా, తమ జన్మకు కారణమైన నాన్నే దైవమని నమ్మిన ఆ కుమార్తెలు రూ.6 లక్షలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తండ్రీకూతుళ్ల బంధానికి నిలువుటద్దంగా నిలిచారు.
News February 2, 2026
సరస్వతీ దేవి వీణాగానం కన్నా తీయనైంది..

లలితా దేవి కొలువులో సరస్వతీ దేవి తన వీణతో అమృతతుల్యమైన సంగీతాన్ని వినిపించగా, ముక్కోటి దేవతలు పరవశించిపోయారు. ఆ గానాన్ని మెచ్చిన లలితాంబిక ‘బాగుంది’ అని పలికింది. ఆ ఒక్క మాటలోని మాధుర్యం, తన వీణా స్వరాల కంటే మిన్నగా ఉందని గ్రహించిన సరస్వతి దేవి వినమ్రంగా తన వీణను పక్కన పెట్టేసింది. సాక్షాత్తు సంగీతానికి అధిదేవత అయిన సరస్వతి వీణ నాదాన్ని సైతం మించిపోయేంత కమ్మని కంఠస్వరం లలితా దేవిది.


