News May 22, 2024
బంగ్లాదేశ్ MP కోల్‌కతాలో హత్య!
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కోల్‌కతాలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పదరీతిలో గుర్తించారు. ఈ నెల 12న చికిత్స నిమిత్తం అన్వరుల్ కోల్‌కతా వచ్చారు. తన ఫ్రెండ్ గోపాల్ బిశ్వాస్ ఇంట్లో బస చేశారు. కానీ రెండు రోజుల తర్వాత బయటకు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగిరాలేదు. బంగ్లా దౌత్యవేత్తల సమాచారంతో కోల్‌కతా పోలీసులు గాలిస్తుండగా ఆయన మృతదేహం లభ్యమైంది.
Similar News
News January 9, 2025
26 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన SCR
సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 26 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చర్లపల్లి-విశాఖ మధ్య ఈ నెల 11, 12, 13, 16, 17, 18 తేదీల్లో జన్‌సాధారణ్ రైలు(అన్నీ జనరల్ బోగీలు) నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే విశాఖ-చర్లపల్లి మధ్య 10, 11, 12, 15, 16, 17 మధ్య కూడా ఇలాంటి రైళ్లే తిరగనున్నాయి. కేవలం స్టేషన్‌లో టికెట్ తీసుకుని ఈ రైళ్లు ఎక్కేయవచ్చు.
News January 9, 2025
గంభీర్‌పై తివారీ విమర్శలు.. మద్దతుగా నిలిచిన ఆటగాళ్లు
గంభీర్ స్వార్థపరుడంటూ KKR మాజీ ఆటగాడు మనోజ్ తివారీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై క్రికెటర్లు నితీశ్ రాణా, హర్షిత్ రాణా స్పందించారు. ఇద్దరూ తమ ఇన్‌స్టాలో గంభీర్‌కు మద్దతుగా పోస్ట్ చేశారు. ‘విమర్శలనేవి వ్యక్తిగత అభద్రత వల్ల కాక నిజానిజాల ఆధారంగా ఉండాలి. నేను కలిసినవారిలో అత్యంత నిస్వార్థపరుడు గౌతీ భయ్యా’ అని నితీశ్ పేర్కొనగా గంభీర్ ఆటగాళ్లకు అండగా నిలిచి వారిని వెలుగులోకి తెస్తారని హర్షిత్ పేర్కొన్నారు.
News January 9, 2025
14న ఢిల్లీకి సీఎం రేవంత్.. అక్కడి నుంచే విదేశాలకు
TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14న సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. 17న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్న ఆయన రెండు రోజులు అక్కడ పర్యటిస్తారు. 19న సింగపూర్ నుంచి దావోస్‌కు వెళ్లి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరవుతారు. ఇదే పర్యటనలో ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉండగా రద్దయ్యింది.