News June 25, 2024
సెమీస్ రేసు నుంచి బంగ్లాదేశ్ ఔట్

T20WC: సెమీఫైనల్ రేసు నుంచి బంగ్లాదేశ్ ఔటైంది. ఆ జట్టు సెమీస్ వెళ్లాలంటే అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలోనే ఛేదించాలి. కానీ బంగ్లా అంతకుమించి బంతులను ఎదుర్కొంది. దీంతో బంగ్లా ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచులో అఫ్గానిస్థాన్ గెలిస్తేనే రషీద్ సేన సెమీఫైనల్ చేరుతుంది. లేదంటే ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.
Similar News
News December 2, 2025
పార్వతీపురం: ‘పరిపాలనా యంత్రాంగం ఆరోగ్యం, శ్రేయస్సు ముఖ్యం’

జిల్లా పరిపాలనా యంత్రాంగం ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ముఖ్యమని, అందుకే ఈ ప్రత్యేక వైద్య శిబిరమని జిల్లా డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది ఆరోగ్యం చాలా ముఖ్యమని అన్నారు. ఆరోగ్యవంతమైన సిబ్బంది మాత్రమే సమర్థవంతంగా పనిచేయగలుగుతారన్నారు.
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


