News February 12, 2025
బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం

మహిళా క్రికెటర్ షోహ్లీ అఖ్తర్(36)పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐదేళ్ల నిషేధాన్ని విధించింది. 2023లో సౌతాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఆమె మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. జమునా టీవీ అనే వార్తాసంస్థ ఆ ఏడాది ఈ ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్‌ను బయటపెట్టింది. తొలుత ఆరోపణల్ని అంగీకరించని షోహ్లీ, ఆ తర్వాత ఒప్పుకున్నారు. దీంతో ఆమెపై BCB నిషేధాన్ని విధించింది.
Similar News
News January 24, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

ముంబై పోర్ట్ అథారిటీ 24 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://mumbaiport.gov.in
News January 24, 2026
రేపు ఈ పనులు చేయడం మహా పాపం: పండితులు

రథ సప్తమి నాడు కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అభ్యంగ స్నానం చేయకూడదని అంటున్నారు. మాంసాహారం, మద్యపానాలకు దూరంగా ఉండాలంటున్నారు. జుట్టు, గోర్లు కత్తిరించుకోవద్దని సూచిస్తున్నారు. ఈ నియమాలు అతిక్రమిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. శాస్త్ర ప్రకారం.. సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం, సప్తమి రోజుల్లోనూ ఈ నియమాలు పాటించాలట.
News January 24, 2026
కురుల ఆరోగ్యాన్ని పెంచే తమలపాకు

తమలపాకులు కురుల ఆరోగ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కురులను దృఢంగా చేసి చుండ్రును నియంత్రిస్తాయి. * మందార పూలు, తమలపాకులు, కరివేపాకు, తులసి ఆకులను పేస్ట్ చేసి 2స్పూన్ల నూనె కలిపి తలకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. * తమలపాకు పేస్టుకు కాస్త కొబ్బరినూనె, ఆముదం కలిపి తలకు పెట్టుకొని అరగంట తర్వాత కడిగేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.


