News August 14, 2024
అరాచక స్థాయికి బంగ్లా ప్రజాస్వామ్య విప్లవం: శశి థరూర్

భారత మైత్రీ చిహ్నాలపై దాడులు చేస్తుంటే బంగ్లా ప్రజలకు మద్దతివ్వడం కష్టమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ప్రజాస్వామ్య విప్లవం అరాచక స్థాయికి దిగజారిందన్నారు. ‘పాక్ దళాలు భారత్ సైన్యానికి దాసోహమైన చిహ్నాలను ముక్కలు చేశారు. భారత సాంస్కృతిక కేంద్రం, ఇస్కాన్ సహా హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. మైనారిటీలపై దాడులు చేశారు. ఇవన్నీ భారత ప్రజలకు ప్రతికూల సంకేతాలు పంపిస్తాయి. ఇది మంచిది కాదు’ అని అన్నారు.
Similar News
News January 19, 2026
నారాయణపేట: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే: ఎస్పీ

బాధితుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 10 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో భూవివాదాలు, కుటుంబ సమస్యలు, గొడవలకు సంబంధించిన అర్జీలు ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News January 19, 2026
భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ భారత్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.
News January 19, 2026
జియో హాట్స్టార్ షాక్.. పెరిగిన ప్లాన్ల ధరలు

జియో హాట్స్టార్ ప్లాన్ల ధరలను సవరించింది. జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం సూపర్, ప్రీమియం కేటగిరీల్లోని 3 నెలల, వార్షిక ప్లాన్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ప్రీమియం వార్షిక ప్లాన్ ₹1,499 నుంచి ₹2,199కి చేరింది. మొబైల్ ప్లాన్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొత్తగా మొబైల్ ప్లాన్ ₹79, సూపర్ ₹149, ప్రీమియం ₹299 నెలవారీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ పెంపు కొత్త సబ్స్క్రైబర్లకు మాత్రమే.


