News March 20, 2024

మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు

image

బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News February 25, 2026

నిత్యమల్లి సాగుతో ఏడాదికి రూ.1.2కోట్లు!

image

సంప్రదాయ పంటలతో నష్టాలు చూస్తున్న ఒడిశాలోని గంజాం జిల్లా రలబ గ్రామ రైతులు పూల సాగుతో భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. గ్రూపులుగా ఏర్పడి రజనీగంధ (నిత్యమల్లి) సాగుతో ఏడాదికి ₹1.2 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. పూలను భువనేశ్వర్, కోల్‌కతా వంటి నగరాల మార్కెట్లకు తరలించి మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ పంట కష్టాల్లో ఉన్న రైతులకు కొత్త ఆశను చూపుతూ స్మార్ట్ అగ్రికల్చర్‌కు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

News February 25, 2026

ఏటి సూతకం అంటే ఏంటి..?

image

తల్లి/తండ్రి మరణిస్తే కుమారుడు వారి మరణానంతర కర్మలను ఓ ఏడాది పాటు నిర్వహించే కాలాన్ని ‘ఏటి సూతకం’ అంటారు. శాస్త్రం ప్రకారం.. తండ్రి ఆత్మయే కొడుకుగా జన్మిస్తుంది. అందుకే తండ్రి మరణించాక ఆయన జీవుడి అభ్యున్నతి కోసం ఏడాది పాటు సత్కర్మలు చేయడం కొడుకు బాధ్యత. ఈ కాలంలో చేసే అన్నదానం, వస్త్రదానం, పురాణ శ్రవణం.. ఇవన్నీ మరణించిన తల్లిదండ్రుల ఖాతాలో చేరతాయి. ఇది వారిపై కృతజ్ఞతను చాటుకునే పవిత్ర సమయం.

News February 25, 2026

KRCLలో 190 అప్రెంటిస్ పోస్టులు

image

కొంకణ్ రైల్వే కార్పొరేషన్(KRCL)190 ట్రైనీ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, డిగ్రీ (BA/BSc/BCom/BBA/BMS), డిప్లొమా అర్హత గలవారు మార్చి 21 వరకు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://konkanrailway.com.