News June 20, 2024
పదో తరగతి అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 484 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి పాసై 18-26 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. జీతం రూ.19,500- రూ.37,815 వరకు అందుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 27లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వెబ్సైట్:https://ibpsonline.ibps.in/cbiskssnov23/
Similar News
News January 20, 2026
ఆర్సీబీ సరికొత్త చరిత్ర

WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నీలో వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. గత సీజన్లో RCB తన చివరి మ్యాచ్‌లో గెలవగా ఈసారి వరుసగా ఐదు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 2024లో తొలి ట్రోఫీని గెలుచుకున్న స్మృతి సేన మరోసారి టైటిల్‌పై కన్నేసింది. నిన్న గుజరాత్‌తో మ్యాచులో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
News January 20, 2026
ఏ బాటిల్లో నీటిని నిల్వ చేస్తున్నారు?

తాగే నీటిని నిల్వ చేసే సీసా కూడా రుచిని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాగి సీసాలో 16 గంటల పాటు నీటిని నిల్వ ఉంచి తాగితే శరీరానికి మేలు చేస్తుంది. అయితే వీటిలో నిమ్మరసం వంటివి నిల్వ చేయకూడదు. గాజు సీసా నిల్వకు ఉత్తమం. ఇందులో ఎలాంటి రసాయనచర్యలు ఉండవు. తేలికగా ఉంటాయని వాడే ప్లాస్టిక్ బాటిల్స్ ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా పాతబడ్డవి వాడకపోవడం మేలు.
News January 20, 2026
మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.


