News September 8, 2025
బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి: భట్టి

TG: ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘రుణమాఫీ, రైతు భరోసా పేరిట ప్రభుత్వం రైతుల పక్షాన రూ.30వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి. ఆస్తుల తాకట్టు, FDలు చేయండంటూ వారిని ఒత్తిడి చేయొద్దు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి’ అని సూచించారు.
Similar News
News September 9, 2025
డిమాండ్‌లు నెరవేర్చకపోతే కాలేజీలు మూసివేస్తాం: APPDCMA

AP: పెండింగ్‌లో ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ డిమాండ్ చేసింది. లేదంటే కాలేజీలను నిరవధికంగా మూసివేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. 2023-24, 2024-25 అకడమిక్ ఇయర్స్‌కు సంబంధించిన ఫీజులు పెండింగ్‌లో ఉండటం వల్ల యాజమాన్యాలపై భారం పడుతోందని పేర్కొంది. కోర్సుల ఫీజులను కూడా సవరించాలని, 2014-19లో ఉన్న విధానాలను అమలు చేయాలని కోరింది.
News September 9, 2025
ఉప రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే..

ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. మనదగ్గర MLC ఓటింగ్ మాదిరే ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలి. తర్వాత ఇష్టమైతే మరో అభ్యర్థికి రెండో ప్రాధాన్యత వేయొచ్చు. అయితే NDA, INDI కూటమి రెండో ప్రాధాన్యత ఓటు వేయొద్దని తమ ఎంపీలకు ఇప్పటికే స్పష్టం చేశాయి. అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు.
News September 9, 2025
నేటి నుంచి ఆసియా కప్ సమరం

యూఏఈ వేదికగా ఇవాళ్టి నుంచి ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) జరగనుంది. తొలి మ్యాచులో నేడు గ్రూప్-Bలోని అఫ్గానిస్థాన్, హాంకాంగ్ తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ టీవీ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్షం ప్రసారం చూడవచ్చు. రేపు గ్రూప్-Aలోని భారత్, యూఏఈ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.