News March 14, 2025
రెండు రోజులు బ్యాంకులు బంద్!

ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఆ 2 రోజులు బ్యాంకులు బంద్ అయ్యే అవకాశం ఉంది. అన్ని క్యాడర్లలో నియామకాలు, వారంలో 5 రోజుల పని తదితర డిమాండ్ల సాధనకు UFBU సమ్మె చేస్తోంది.
Similar News
News March 15, 2025
పవన్కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

బహుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం <<15762616>>పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు<<>> నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని ఆయన ట్వీట్ చేశారు. స్వాభిమానంతో తమ మాతృభాషను, తల్లిని కాపాడుకునే ప్రయత్నమనే విషయాన్ని పవన్కి దయచేసి ఎవరైనా చెప్పాలని ప్రకాశ్ రాజ్ కోరారు.
News March 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 15, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.