News February 10, 2025

గత ప్రభుత్వ అక్రమాలపై బ్యాంకులు సమాచారం ఇవ్వాలి: సీఎం

image

AP: అన్నదాతల బాగు కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. హార్టికల్చర్, ప్రకృతి సాగుకు మద్దతు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్‌లో భాగస్వాములు కావాలని SLBC సమావేశంలో కోరారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదని స్పష్టం చేశారు.

Similar News

News January 26, 2026

ఈ 5 రోజులు ఎంతో పుణ్యమైనవి.. ఎందుకంటే?

image

మాఘ శుద్ధ సప్తమి నుంచి ఏకాదశి వరకు గల 5 రోజులను ‘భీష్మ పంచకాలు’ అంటారు. యుద్ధంలో గాయపడిన భీష్ముడు, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాతే తన ప్రాణాలను విడవాలని నిశ్చయించుకున్నారు. అందుకే సప్తమి నుంచి 5 రోజుల పాటు ఒక్కో ప్రాణాన్ని విడుస్తూ అష్టమి నాటికి సిద్ధమయ్యారు. ఈ 5 రోజులు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనవి. ఈ సమయంలో చేసే జపతపాలు అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం.

News January 26, 2026

మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?

image

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మోక్షజ్ఞ తొలి సినిమాను లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే టైటిల్‌తో రూపొందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News January 26, 2026

సోమవారం నాడు ఇలా చేస్తే.. శివానుగ్రహం!

image

సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. పార్వతీదేవి 16 సోమవారాలు ఉపవాసంతో శివుని అనుగ్రహం పొందిందని పురాణాల వాక్కు. ఈరోజు భక్తులు బిల్వపత్రాలతో పూజించి, రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు తొలగి కోరికలు నెరవేరాలంటే శివ పూజ సమయంలో ‘శివ చాలీసా’ పఠించడం శ్రేయస్కరం. ఉదయం లేదా సాయంత్రం భక్తితో శివ చాలీసా పఠిస్తే శివుని కృప కలిగి జీవితంలోని సమస్యలన్నీ గట్టెక్కుతాయని పండితులు సూచిస్తున్నారు.