News October 6, 2025
పావలా వడ్డీకే బ్యాంకుల విద్యారుణాలు: CBN

AP: విదేశాల్లో UG, PG చేయాలనుకునే వారికి పావలా వడ్డీకే బ్యాంకులు రుణాలిచ్చేలా స్కీమ్ రూపొందించాలని CM CBN ఆదేశించారు. ఎంతమందికైనా అందించగలగాలన్నారు. విదేశాలతో పాటు దేశంలో ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కోర్సులకూ వర్తింపచేయాలని సూచించారు. బీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు నెలకొల్పాలని ఆదేశించారు. హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చేలా అధ్యయనం చేయాలన్నారు.
Similar News
News March 24, 2026
తమిళనాడులో హోరాహోరీ తప్పదా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదని VoteVibe ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. CNN-News18 రిలీజ్ చేసిన సర్వే ప్రకారం 234 సీట్లున్న అసెంబ్లీలో DMK, INC, CPI, CPM కలిసి 113-123 సీట్లు గెలిచే అవకాశం ఉంది. AIADMK, BJP కూటమి 106-116 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. విజయ్ పార్టీ TVK 2-8 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. 39%మందిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు చెప్పింది.
#ELECTIONS2026
News March 24, 2026
రీ-రిలీజ్ ట్రెండ్.. మరోసారి థియేటర్లలోకి స్టార్ల సినిమాలు

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ప్రభాస్, కాజల్ జంటగా నటించిన ‘డార్లింగ్’ APR 23న మరోసారి థియేటర్లలోకి రానుంది. Jr.NTR బర్త్‌డే సందర్భంగా మే 20న ‘ఊసరవెల్లి’, ‘ఆంధ్రావాలా’ స్పెషల్ షోలు వేయనున్నారు. APR 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ‘రేసు గుర్రం’ రీ-రిలీజ్ కానుంది. మహేశ్ బాబు నటించిన ‘అతిథి’ మే 29న, ‘పోకిరి’ AUGలో మరోసారి థియేటర్లలో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
News March 24, 2026
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఏ1గా కేటీఆర్

TG: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ పేరును చేర్చింది. ఏ3గా HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన FEO కంపెనీని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది.


