News March 17, 2024
బాన్సువాడ: పాఠశాల భవనం పైనుంచి దూకిన విద్యార్థిని

మండలంలోని బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాలలో పదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని పరీక్షల భయంతో ఆదివారం పాఠశాల భవనం పైనుంచి దూకింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమె కుటుంబీకులు NZB జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 2, 2026
NZB: కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి: ఎంపీ సురేశ్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.ఆర్. సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం పైసా సాయం చేయకున్నా, కేసీఆర్ దార్శనికతతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వాస్తవ విరుద్ధమైన మాటలు ఉపసంహరించుకోకుంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని హెచ్చరించారు.
News April 2, 2026
నిజామాబాద్: హనుమాన్ శోభాయాత్ర బందోబస్తు పర్యవేక్షించిన సీపీ

నిజామాబాద్ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా చేపట్టిన శోభాయాత్ర బందోబస్తును సీపీ సాయి చైతన్య గురువారం పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్ర సరళిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదనపు డీసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి, తదితరులు ఉన్నారు.
News April 2, 2026
మోస్రా: పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గురువారం మోస్రాలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


