News August 26, 2025

బార్ లైసెన్స్ అప్లికేషన్లు.. 29 వరకు ఛాన్స్

image

AP: బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువును ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. వినాయక చవితి, బ్యాంకు సెలవుల దృష్ట్యా గడువు పొడిగించినట్లు తెలిపింది. గడువు పెంపుపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. బార్ లైసెన్సులకు ఈ నెల 30న ఉ. 8 గం.కు లాటరీ తీయనున్నారు. కాగా బార్లకు ఇచ్చే మద్యంపై పన్ను, ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరనే నిబంధనలతో తక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం.

Similar News

News August 26, 2025

HYD బాటలో గురుగ్రామ్.. కుక్కకు ఉద్యోగం

image

గురుగ్రామ్‌కు చెందిన ‘లీప్‌ఫ్రాగ్’ అనే కంపెనీ ‘చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్’గా గోల్డెన్ రిట్రివర్ శునకాన్ని నియమించుకుంది. ‘ఉద్యోగులు స్ట్రెస్ అవ్వకుండా ఉండేలా తన క్యూట్‌నెస్‌తో ఆనందపరచడమే దీని పని. వారికి ప్రశాంతతను అందిస్తూ పరధ్యానం చెందకుండా ఉండేందుకు ఇది ప్రయత్నిస్తుంది’ అని లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. కాగా గతంలోనే హైదరాబాద్‌లోని ఓ కంపెనీలోనూ చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌గా కుక్కను నియమించింది.

News August 26, 2025

ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

TG: ఈ నెల 30 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వర్షాకాల సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 30న ఉదయం 10.30 గం.కు అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. ఇందులో ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది.

News August 26, 2025

RTC ఉద్యోగులకు ప్రమోషన్లు.. సీఎం గ్రీన్ సిగ్నల్

image

APSRTC ఉద్యోగుల పదోన్నతులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులతో పాటు సూపర్‌వైజర్ కేడర్ వరకు అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. సుమారు 3 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకు GO విడుదలై, సెప్టెంబరు 1 నుంచి ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.