News May 7, 2025

రాష్ట్రంలో బార్ల లైసెన్సు ఫీజులు తగ్గింపు

image

AP: టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం బార్ల లైసెన్స్ ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించింది. బార్ల లైసెన్స్‌ ఫీజు రూ.5 లక్షలు, 3, 5 స్టార్ హోటళ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించేసింది. నాన్ రిఫండబుల్ ఛార్జీని రూ.20 లక్షలుగా పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

Similar News

News January 28, 2026

RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

AP: RTCలో పనిచేస్తున్న 4వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. ADC/కంట్రోలర్, లీడింగ్ హెడ్స్‌లకు పదోన్నతి లభిస్తుంది. నిర్ణీత టెస్ట్ పాసైన కండక్టర్లు Jr అసిస్టెంట్లు కానున్నారు. ‘గత OCTలోనే 7500 మందికి ప్రమోషన్‌పై GO వచ్చినా 550 మందికే ఇచ్చారు. దీనిపై లేఖ ఇవ్వగా సీనియార్టీపై క్లారిటీ ఇస్తూ MD ఆదేశాలిచ్చారు. వారంలోపే మిగతా వారికీ పదోన్నతి వస్తుంది’ అని EU నేతలు దామోదర్, నరసయ్య తెలిపారు.

News January 28, 2026

రూ.1,002 కోట్లు.. తొలి ఇండియన్ సినిమాగా ధురంధర్

image

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇండియాలోనే రూ.1,002కోట్ల (గ్రాస్) వసూళ్లు సాధించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా హిందీలో విడుదలై వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కింది. షారుఖ్ ఖాన్ జవాన్ (రూ.760) రికార్డులు బద్దలుకొట్టింది.

News January 28, 2026

చంద్రబాబు అరకు పర్యటన రద్దు

image

AP: సీఎం చంద్రబాబు రేపటి అరకు పర్యటన రద్దైంది. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఆయన బారామతి వెళ్లనున్నారు. దీంతో రేపటి పర్యటనను రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం‌తో పాటు మంత్రి లోకేశ్‌ కూడా అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.