News April 28, 2024
బరాబర్ గుంపు మేస్త్రీనే: రేవంత్

TG: తాను బరాబర్ గుంపు మేస్త్రీనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KCRలాగా చిల్లర పనులు చెయ్యను. నా కూతురు పెళ్లికి నన్ను కేసీఆర్ జైల్లో పెడితే.. ఆయన కూతురు కవిత ఇప్పుడు జైల్లో ఉంది. కేసీఆర్‌లాగా నేను పోలీసులను వాడను. ఆయన సలహాలిస్తానంటే ఇంటికెళ్లి కలుస్తా. పదేళ్లు సీఎం పదవి మాదే. ఏ ఎమ్మెల్యేను పార్టీలోకి రావాలని నేను కోరలేదు. వారే స్వయంగా పార్టీలోకి వచ్చారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 6, 2026
బెంగాల్ ఎన్నికలు.. ఒంటరిగా బరిలోకి కాంగ్రెస్..!

వె.బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో 2 దశాబ్దాలుగా ఉన్న పొత్తు తెంచుకుని 2006 తర్వాత తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగనుంది. 294 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పొత్తుల కారణంగానే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడం లేదని హైకమాండ్‌కు తెలిపారు.
News February 6, 2026
ప్యూర్ సిల్వర్‌ను గుర్తించడం ఎలా?

* ప్యూర్ సిల్వర్ అయస్కాంతానికి అతుక్కోదు.
* ఐస్ ముక్క ఉంచితే వెంటనే కరగడం మొదలవుతుంది.
* వాసన ఉండదు. ఏదైనా లోహాన్ని కలిపినప్పుడు/పూత వేసినప్పుడు రాగి లేదా మెటల్ వాసన వస్తుంది.
* శుభ్రమైన తెల్లటి వస్త్రంతో వెండి వస్తువుపై రుద్దితే నలుపు/గ్రే మచ్చలు కనిపిస్తాయి.
* నీటిలో త్వరగా మునిగిపోతుంది. నకిలీ వెండి మెల్లగా నీటి అడుగుకు చేరుతుంది.
* మరో లోహంతో కొట్టినప్పుడు క్లియర్ బెల్ సౌండ్ వస్తుంది.
News February 6, 2026
వైభవ్ ఓ అద్భుతం: అశ్విన్

U19 WC ఫైనల్‌లో 175 <<19067167>>పరుగులు చేసిన<<>> వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ‘15 సిక్సులు, 15 ఫోర్లు బాదడం అసాధారణం. ఇందుకోసమే పుట్టాడా అన్నట్లుగా ఆ వేదికను తన సొంతం చేసుకున్నాడు. అతడో అద్భుతం. ఈ పిల్లాడు అంతర్జాతీయ క్రికెట్ తలుపులను వేగంగా, గట్టిగా తడుతున్నాడు. T20 WC తర్వాత ఆ తలుపులు తెరుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని ట్వీట్ చేశారు.


