News October 4, 2024
కమల తరఫున ప్రచార బరిలోకి బరాక్ ఒబామా

డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కమల అభ్యర్థిత్వ నామినేషన్‌కు ఒబామా, ఆయన సతీమణి మిచెల్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. స్వింగ్ ఓటర్లే లక్ష్యంగా Oct 10న పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో ఒబామా మొదటి ప్రచార సభ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సభలో కమల కూడా పాల్గొనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News March 18, 2026
తిరుమల శ్రీవారి మహిమకు ఇదే నిదర్శనం.!

ఆలయాల్లో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. అందరూ ముందుగా శిరస్సు వంచి ధ్వజస్తంభానికే నమస్కరిస్తారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం నేల నుంచి 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో పుచ్చు ఏర్పడటంతో 1982లో TTD మరమ్మతులకు సంకల్పించింది. EO PVRK ప్రసాద్ ధ్వజస్తంభ పైభాగాన అలంకరణలను తొలగించారు. ఆశ్చర్యకరంగా ధ్వజస్తంభం నేల కింది భాగంలో ఎలాంటి ఆధారం లేకుండా ఉండటాన్ని చూసి ఆయన, సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
News March 18, 2026
సంచలనం.. డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డికి లింక్?

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయన సూచనతో డ్రైవర్ శరత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ వద్ద డ్రగ్స్ కొన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్‌లపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.
News March 18, 2026
74 మంది ఎమ్మెల్యేలకు TMC షాక్

W.బెంగాల్ CM మమత 74మంది సిట్టింగ్ MLAలకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం పార్టీకున్న MLA(223)లలో ఇది 3వ వంతు కావడం గమనార్హం. 3పర్యాయాలుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నిన్న ప్రకటించిన 291మంది అభ్యర్థుల్లో 135మంది సిట్టింగ్ MLAలు ఉండగా, 15మంది స్థానాలు మారాయి. WBలో APR 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


