News December 3, 2024
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి

AP: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయి. తుళ్లూరు శివారు తానాపతి చెరువు నుంచి నెక్కల్లుకి వెళ్లే దారిలో 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ హైటెన్షన్ లైన్లు అడ్డుగా ఉండటంతో వాటిని తొలగించాలని MLA బాలకృష్ణ కోరారు. ఈ తొలగింపు పూర్తైతే జనవరిలో పనులు మొదలయ్యే ఛాన్సుంది. ఫేజ్-1లో 300 పడకలు, భవిష్యత్తులో 1000 పడకలకు ఆస్పత్రిని విస్తరించనున్నారు.
Similar News
News November 28, 2025
వింత ఆచారం.. అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలు

తెలంగాణ వినూత్న ఆచారాలకు నిలయం. ఇక్కడ ప్రాంతాలను బట్టి ఆచారాలు, ఆహారపు అలవాట్లూ మారుతుంటాయి. అలాంటి ఓ ఆచారం ప్రకారం పెళ్లిలో అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలను వాడటం కొన్నిచోట్ల కనిపిస్తుంది. జొన్నలను కొన్ని వర్గాల ప్రజలు బియ్యం కంటే పవిత్రంగా భావించి అక్షింతలుగా వాడతారట. ఆదిలాబాద్, వికారాబాద్, వెస్ట్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పలు చోట్ల ఇది కనిపిస్తుంది. మీ ప్రాంతంలో ఈ ఆచారం ఉందా?COMMENT
News November 28, 2025
భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 28, 2025
స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.


