News June 22, 2024

బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోంది: CM రేవంత్

image

TG: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లక్షల మందికి సేవలందిస్తోందని CM రేవంత్‌ అన్నారు. 24వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అటు ఆసుపత్రి సేవల విస్తరణ కోసం CM సహకారం కోరామని, అందుకు ఆయన అంగీకరించారని నందమూరి బాలకృష్ణ తెలిపారు. దీని సేవల విస్తరణకు 10ఎకరాలు కేటాయించాలని కోరినట్లు BRS నేత నామా నాగేశ్వరరావు అన్నారు.

Similar News

News January 20, 2025

నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం

image

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

News January 20, 2025

జనవరి 20: చరిత్రలో ఈరోజు

image

1900: సంస్కృతాంధ్ర పండితుడు పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం
1907: ప్రముఖ రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం
1920: సినీ దర్శకుడు, ‘జానపద బ్రహ్మ’ బి.విఠలాచార్య జననం
1940: సినీనటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు జననం
1957: భారత్ తొలి అణు రియాక్టర్ ‘అప్సర'(ముంబై) ప్రారంభం

News January 20, 2025

విశ్వవిజేతలకు మోదీ అభినందనలు

image

ఖో ఖో విశ్వవిజేతలుగా నిలిచిన భారత పురుషుల, మహిళల జట్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయాలతో గర్విస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆటగాళ్ల పట్టుదల, నిబద్దత అభినందనీయమని కొనియాడారు. యువతకు ఖో ఖోలో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ విజయం దోహదపడుతుందని పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి విజేతలకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.