News September 11, 2025

బతుకమ్మ సంబరాలు.. జిల్లాకు రూ.30లక్షలు

image

TG: ఎప్పటిలాగే ఈసారి కూడా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లాకు రూ.30 లక్షలు చొప్పున మొత్తం రూ.1.20 కోట్ల నిధులు కేటాయించింది. ఈనెల 21న వరంగల్ వేయిస్తంభాల గుడిలో జరగనున్న సంబరాలతో వేడుకలు మొదలవుతాయి. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా 28న ఎల్బీ స్టేడియంలో 10వేల మంది ఆడపడుచులు బతుకమ్మ ఆడనున్నారు. 30న ట్యాంక్‌బండ్ వద్ద జరిగే వేడుకలతో సంబరాలు ముగియనున్నాయి.

Similar News

News September 11, 2025

లిక్కర్ స్కాం కేసులో సిట్ సోదాలు

image

AP: లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. హైదరాబాద్, విశాఖలో నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని స్నేహ హౌస్, రోడ్ నంబర్-2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్-రాజేంద్రనగర్, ఖైరతాబాద్-కమలాపురి కాలనీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని వాల్తేర్ రోడ్-వెస్ట్ వింగ్‌లో ఉన్న మరో కార్యాలయంలోనూ రైడ్ జరుగుతోంది.

News September 11, 2025

ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం ఉ.9.30 గం.కు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం సాయంత్రం అమరావతికి తిరిగి రానున్నారు.

News September 11, 2025

NCLTలో 32 పోస్టులు

image

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(<>NCLT<<>>) స్టెనోగ్రాఫర్ 18, ప్రైవేట్ సెక్యూరిటీస్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైన కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ గల అభ్యర్థులు అక్టోబర్ 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.45వేలు, ప్రైవేట్ సెక్యూరిటీకి రూ.50వేలు జీతం అందిస్తారు. వెబ్ సైట్: https://nclt.gov.in/