News November 7, 2024

ఈనెల 18-26 మధ్య జిల్లాల్లో BC కమిషన్ పర్యటన

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన BC కమిషన్ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ నెల 18 నుంచి 26 వరకు ఈ పర్యటన ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో పర్యటించనుంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రత్యేక కమిషన్‌తో సమాచారం పంచుకోనుంది.

Similar News

News November 21, 2025

NZB: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి: TWJF

image

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని TWJF నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రాల్లోని విలేకరులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. దాడుల నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రామచందర్ రెడ్డి, రాజు, పరమేశ్వర్, భాస్కర్, ప్రవీణ్, అనిత తదితరులు పాల్గొన్నారు.

News November 21, 2025

OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్‌గా పంత్

image

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్‌గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.

News November 21, 2025

ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

image

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.