News March 13, 2025
BC-D కేటగిరిలో 3వ ర్యాంకు సాధించిన ధర్మపురి వాసి

ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన రేణు మోహన్ ఇటీవల విడుదల అయినా గ్రూప్-2 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 155 ర్యాంకు, బాసర జోన్లో 11వ ర్యాంకు, BC-D కేటగిరి లో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం నిజామాబాద్ బిసి సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఐలయ్య, నర్సవ్వ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 14, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➤జిల్లాలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
➤ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు
➤ కొత్తమ్మతల్లి ఆలయంలో మహా మృత్యుంజయ యాగం
➤టెక్కలిలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
➤SKLM: గ్రంథాలయాలు పాఠకులకు నేస్తాలు
➤మందసలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు
➤నరసన్నపేట: నో స్మోకింగ్ జోన్లుగా పాఠశాల ప్రాంగణాలు
News November 14, 2025
HNK: ఆర్మీ రిక్రూట్మెంట్లో చీటింగ్.. అభినయ్‌పై కేసు

హన్మకొండలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో చీటింగ్ వెలుగులోకి వచ్చింది. ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధించి మెడికల్‌కు హాజరైన రంగారెడ్డి జిల్లా గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన అభినయ్ తన ఫొటోకు బదులుగా మరొకరి ఫొటో డాక్యుమెంట్లపై అతికించినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మీ ఫిర్యాదు మేరకు అతనిపై బీఎన్ఎస్ 318(2), 319(2), 336(2), 336(3), 340(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News November 14, 2025
8 రోజులు క్రిస్మస్ సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనార్టీ స్కూలు విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా 21 నుంచి 28 వరకు హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. అటు మిగతా స్కూల్ విద్యార్థులకు క్రిస్మస్ రోజు మాత్రమే సెలవు ఉంటుంది.


