News March 13, 2025
BC-D కేటగిరిలో 3వ ర్యాంకు సాధించిన ధర్మపురి వాసి

ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన రేణు మోహన్ ఇటీవల విడుదల అయినా గ్రూప్-2 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 155 ర్యాంకు, బాసర జోన్లో 11వ ర్యాంకు, BC-D కేటగిరి లో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం నిజామాబాద్ బిసి సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఐలయ్య, నర్సవ్వ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 22, 2025
భీమడోలు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

భీమడోలు రైల్వే గేట్ శ్రీకనకదుర్గమ్మ టెంపుల్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనపై ఎస్ఐ సుధాకర్ వివరాల ప్రకారం.. పెదవేగి (M) వేగివాడకు చెందిన ఘంట భరత్ (21), చల్లా సుబ్రహ్మణ్యం మిత్రులన్నారు. ఇద్దరూ బైక్‌పై తాడేపల్లిగూడెం వెళుతుండగా భీమడోలులో వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టిందన్నారు. ఘటనలో భరత్ మృతి చెందగా.. సుబ్రహ్మణ్యాన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.
News March 22, 2025
HYD: వరదల్లో కొట్టుకొచ్చిన శిశువు మృతదేహం (PHOTO)

హైదరాబాద్‌లో శిశువు మృతదేహం కలకలం రేపింది. అర్ధరాత్రి హైటెక్ సిటీలో భారీ వర్షానికి వరదలు వచ్చాయి. మెడికవర్ హాస్పిటల్ ముందున్న మ్యాన్ హోల్ వద్ద ఓ పసికందు మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన వాహనదారులు వెంటనే లోకల్ PSకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
News March 22, 2025
లైంగిక ఆరోపణలు.. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఏనుగుమర్రి జడ్పీ ఉన్నత పాఠశాలలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బొజ్జన్న బాలికలను లైంగికంగా వేధించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.