News April 2, 2025
రిజర్వేషన్ల పెంపుపై నేడు ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా

TG: బీసీల రిజర్వేషన్లు 42% పెంపుపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, MLAలు మహాధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలపగా పార్లమెంటులోనూ ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, AICC నేతలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పాల్గొననున్నారు.
Similar News
News April 3, 2025
ఎమ్మెల్సీగా ప్రమాణం.. పవన్ కళ్యాణ్‌ను కలిసిన నాగబాబు

AP: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన నేత నాగబాబు విజయవాడలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. నాగబాబుకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. నిన్న నాగబాబు సీఎం చంద్రబాబు, తన సోదరుడు చిరంజీవితో భేటీ అయ్యారు.
News April 3, 2025
ట్రంప్ టారిఫ్స్‌పై ప్రపంచ దేశాధినేతల కామెంట్స్

యూఎస్ చీఫ్ ట్రంప్ టారిఫ్స్‌పై ప్రపంచ నేతలు పెదవి విరుస్తున్నారు. యూరోపియన్ యూనియన్‌పై 20% టారిఫ్ విధించడాన్ని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తప్పు పట్టారు. మరోవైపు ట్రంప్ టారిఫ్ అన్యాయంగా ఉందని ఆస్ట్రేలియా పీఎం అల్బనీస్ వ్యాఖ్యానించారు. యూఎస్ బాస్ నిర్ణయంతో ఏ ఒక్కరికి ప్రయోజనం లేదని ఐర్లాండ్ ప్రధాని మార్టిన్ అన్నారు. ట్రంప్‌కు దీటుగా బదులిస్తామని చైనా ప్రభుత్వం హెచ్చరించింది.
News April 3, 2025
బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్!

బంగారం ధరలు ఇవాళ కూడా పెరగడంతో ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.85,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.540 పెరగడంతో రూ.93,380 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,900గా ఉంది. గత తొమ్మిది రోజుల్లో గోల్డ్ రేటు రూ.4090 పెరగడం గమనార్హం.