News February 3, 2025

వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తే CM: తీన్మార్ మల్లన్న

image

TG: వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తి CM అవడం ఖాయమని, రేవంత్ రెడ్డే చివరి OC CM అని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న అన్నారు. హనుమకొండలో ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు BCలే ఓనర్లు అని, అవసరమైతే BRS పార్టీని కొనేంత డబ్బు తమ దగ్గర ఉందని అన్నారు. OC వర్గాల నుంచే 60మంది MLAలు ఉన్నారని, బీ ఫారం ఇవ్వని వారితో BCలకు ఇక యుద్ధమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Similar News

News February 3, 2025

శక్తిమంతమైన టూల్‌ను తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ

image

ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేయగల డీప్ రీసెర్చ్ అనే శక్తిమంతమైన టూల్‌ను ఓపెన్ ఏఐ తీసుకొచ్చింది. అత్యంత కష్టమైన పరిశోధనను కూడా ఈ టూల్ సమర్థంగా పూర్తి చేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. ‘మనిషి గంటల తరబడి చేసే పనిని డీప్ రీసెర్చ్ కేవలం నిమిషాల వ్యవధిలో చేయగలదు. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. నెట్టింట సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి నివేదికను రిసెర్చ్ అనలిస్ట్ స్థాయిలో తయారుచేసి మీకు అందిస్తుంది’ అని పేర్కొంది.

News February 3, 2025

CBSE 10, 12వ తరగతి అడ్మిట్ కార్డులు

image

CBSE టెన్త్, 12వ తరగతులకు సంబంధించిన అడ్మిట్ కార్డులను బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, టెన్త్ పరీక్షలు మార్చి 18న, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. దేశ వ్యాప్తంగా 8,000 స్కూళ్ల నుంచి సుమారు 44 లక్షల మంది ఈ బోర్డు పరీక్షలకు హాజరుకానున్నారు. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 3, 2025

‘లక్కీ భాస్కర్’ తరహాలో డబ్బు సంపాదించాలనుకుని..

image

AP: లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంకు సొమ్మును వాడుకుని మనీ సంపాదిస్తాడు. అదే తరహాలో చేయాలనుకుని ఓ ఉద్యోగి పోలీసులకు చిక్కాడు. మార్కాపురంలోని సచివాలయ కార్యదర్శి P.వెంకటేశ్వర్లు పింఛన్ల సొమ్ము ₹2.66L తీసుకుని JAN 31న పారిపోయాడు. వివిధ బెట్టింగ్ యాప్‌లలో పెట్టి ఒక్క రోజులోనే ₹10L సంపాదించాలనుకుని మొత్తం పోగొట్టుకున్నాడు. బంధువులు డబ్బు చెల్లించడంతో పోలీసులు అతడిని హెచ్చరించి వదిలేశారు.