News October 8, 2025
బీసీ రిజర్వేషన్లు.. విచారణ వాయిదా

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోపై మధ్యాహ్నం 12.30కు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు, తీర్పును చదివి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు హైకోర్టు వద్దకు చేరుకున్నారు.
Similar News
News October 8, 2025
నారద భక్తి సూత్రాలు – 4

‘యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి’ నారద భక్తి సూత్రాల్లో ఇది నాలుగవది. దీనర్థం.. నిష్కల్మషమైన భక్తిని పొందిన మానవుడు సిద్ధుడు అవుతాడు. వారికి మృత్యు భయం ఉండదు. జీవితంలో మరేదీ అవసరం లేదన్నట్లు శాశ్వతమైన తృప్తిని పొందుతాడు. ఈ భక్తి లభించడం వల్ల సాధన పూర్తై, అన్ని కోరికలు తీరిన అనుభూతి కలుగుతుంది. అమరత్వం లభిస్తుంది. సమస్త సుఖాలకు మూలం, ముక్తికి మార్గం ఈ భక్తే. <<-se>>#NBS<<>>
News October 8, 2025
నైట్‌షిఫ్టులతో సంతానోత్పత్తిపై ప్రభావం

ప్రస్తుతకాలంలో ఉద్యోగంలో భాగంగా నైట్‌షిఫ్టుల్లో పనిచేయడం సాధారణం అయిపోయింది. దీనివల్ల మహిళల్లో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలా పనిచేయడం వల్ల శరీరంలోని సహజ జీవగడియారం దెబ్బతింటుంది. దీంతో హార్మోన్లు అసమతుల్యమై గర్భధారణ, సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు పోషకాహారం, నిద్ర తగినంత ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News October 8, 2025
MHలో రిజర్వేషన్లు 50% దాటితే సుప్రీంకోర్టు కొట్టివేసింది: పిటిషనర్లు

TG: బీసీల రిజర్వేషన్ల పెంపు అధికారం ప్రభుత్వానికి ఉన్నా అది 50 శాతం మించకూడదని పిటిషనర్ల తరఫు లాయర్లు హైకోర్టులో వాదించారు. మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50% దాటితే సుప్రీంకోర్టు కొట్టివేసిందని చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల వల్ల సీలింగ్ 50% దాటిందని పేర్కొన్నారు. బీసీల కులగణనపై ఏకసభ్య కమిషన్ నివేదిక పారదర్శకంగా లేదన్నారు. రిజర్వేషన్లపై జీవోలు 9, 41లను సవాల్ చేస్తున్నామని వివరించారు.